బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం…

బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!

 

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె జూనియర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ తనకు సీనియర్ అయిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని జీవన్ గౌడగా పోలీసులు గుర్తించారు. తాజాగా అతడిని అరెస్టు చేశారు (Bengaluru Engineering Student Violated).

ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం, బాధితురాలు బీటెక్ చదువుతోంది (7వ సెమెస్టర్). ఆమెకు జీవన్‌తో మూడు నెలల క్రితమే పరిచయం ఏర్పడింది. అక్టోబర్ 10న లంచ్ సమయంలో అతడు బాధితురాలికి పలుమార్లు కాల్ చేసి ఆర్కిటెక్చర్ బ్లాక్ వద్ద కలుద్దామని చెప్పాడు. అక్కడకు వెళ్లిన ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. ఆపై వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి తలుపులు వేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు జరిగిన దారుణం గురించి మొదట స్నేహితులకు చెప్పింది. అనంతరం, తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి అక్టోబర్ 15న పోలీసులకు ఫిర్యాదు అందింది.

దారుణానికి ఒడిగట్టిన తరువాత నిందితుడు ఆమెకు కాల్ చేసి గర్భనిరోధక మాత్ర కావాలా? అని అడిగినట్టు పోలీసులు తెలిపారు. భవనంలో ఘటన జరిగిన అంతస్తుకు సంబంధించి సీసీటీవీ కెమెరా ఫుటేజీ లేదని తెలిపారు. అయితే, డిజిటల్, ఇతర ఫిజికల్ ఆధారాలను ఫారెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

నగరంలో ఆగస్టులో వెలుగు చూసిన మరో ఘటనలో పేయింగ్ గెస్టు హాస్టల్‌లో ఉంటున్న కాలేజీ విద్యార్థినిపై ఓనర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి సమయంలో కారులో ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అష్రాఫ్‌ను అరెస్టు చేశారు.

ఇక కోల్‌కతాలోని దుర్గాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన అత్యాచర ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న యువతిపై ఆమె క్లాస్‌మెట్‌యే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తనకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version