
యాజమాన్యాల సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి.
యాజమాన్యాల సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల యాజమాన్యాల సమస్యలను ఎమ్మెల్సీ అంజిరెడ్డికి దృష్టికి బుధవారం తీసుకువచ్చారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రైవేట్ కళాశాలలపై కక్షపూరిత దోరణి వుందని, వెంటనే ఫీజు రీయింబర్స్ చెల్లించేలా కృషిచేయాల్సిందిగా ఎమ్మెల్సీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి వెంటనే రియంబర్స్ మెంట్ వచ్చేలా కృషి చేస్తా అని అన్నారు.