
అలరించే వంతెన.
అలరించే వంతెన… కనుచూపుమేర పచ్చందనం… అక్కడే రెండు సుందరమైన కొండలు… వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం… దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన… భారీ, విభిన్న నిర్మాణాలతో తరుచూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరో ఇంజనీరింగ్ అద్భుతం ‘రుయి’ బ్రిడ్జ్. దీనిని మూడేళ్ల పాటు నిర్మించి, 2020లో వంతెనపైకి పర్యాటకులను…