దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి
ఎంఎస్పి వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ బొక్కల నారాయణ మాదిగ
నేటిధాత్రి ఐనవోలు :-
హైదరాబాద్ లో నవంబర్ 1 న చేపట్టిన దళితుల ఆత్మగౌరవ నిరసన సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం ఐనవోలు మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం.ఆర్.పి. ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బరిగల ఏలియా మాదిగ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ ఎన్ఎస్పి వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ జిల్లా జిల్లా ఎమ్మెస్ పి ప్రధాన కార్యదర్శి బొక్కల నారాయణ మాదిగ పాల్గొని మాట్లాడుతూ, ఇది చీఫ్ జస్టిస్ ఇక గవాయి పై జరిగిన దాడి కాదు యావత్తు భారతన్యాయ వ్యవస్థ,రాజ్యాంగం మరియుదళిత సమాజంపై జరిగిన దాడిగా భావించాలి. ఇది ఇంతటితో ఆగదు తర్వాత మన అందరి మీద కూడా దాడి జరుగుతుంది.ఇలాంటి ఘటన భవిష్యత్ లో పునరావతం కాకుండా చూడాలని నారాయణ డిమాండ్ చేస్తూ, తక్షణమే ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నవంబర్ 1న హైదరాబాద్ లో మందకృష్ణ సారథ్యంలో జరిగే ఈ ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు దళిత జాతి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించేలా ఢిల్లీ మెడలు వంచేలా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినవోలు మండలంలో అన్ని గ్రామాల నుంచి ప్రజలను చైతన్యం చేసి వాహనాలు ఏర్పాటు చేసుకొని భారీ సంఖ్యలో దళిత బహుజనులు హైదరాబాద్ తరలి వచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో,జిల్లా నాయకులు ఏం దేవదాస్ , బర్ల బాబు మాదిగ జిల్లా ఎం ఎస్ పి ఉపాధ్యక్షులు. ఎమ్మెస్ పి మండల అధ్యక్షులు ఇస్రం బాబు మాదిగ,
అధికార ప్రతినిధి ఎస్.చంద్రమౌళి మాదిగ,మండల ఉపాధ్యక్షులు బొక్కల అనిల్ మాదిగ మాదిగ, ఉపాధ్యక్షులు బరిగల ఆరోగ్యం మాదిగ,జిల్లా నాయకులుమాదాసి కరుణాకర్ మాదిగ,మార్పిఎస్ సీనియర్ నాయకులు బారిగెల ఏలియా చింత, కోడి కుమార్ స్వామి మాదిగ కొండపర్తి అధ్యక్షులు విష్ణు మాదిగ సిహెచ్ ఆయన అధ్యక్షులు మొలుగురి సంజీవ మాదిగ ఉడుత గూడెం అధ్యక్షులు టి శ్రీనివాస్ మాదిగ
గర్నపెల్లి అధ్యక్షులు జి కుమారస్వామి మాదిగ.
రాంనగర్ అధ్యక్షులు ఆకుల పెళ్లి సాగర్ మాదిగ అధ్యక్షులు రాంనగర్ ఎమ్మెస్ వి ప్రధాన కార్యదర్శి యాకర శ్రీనివాస్ మాదిగ జిల్లా వై అనిల్ మాదిగ బి సోమన్న సంతోష్ మాదిగ ఎం. ఆర్. పి. ఎస్ మరియు అనుబంధ సంఘాల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
