అప్పాని శ్రీనివాస్ వైఖరి నిరసిస్తూ ధర్నా చేపట్టిన కాలనీ వాసులు

అప్పాని శ్రీనివాస్ వైఖరి నిరసిస్తూ ధర్నా చేపట్టిన కాలనీ వాసులు

హనుమాన్ ఆలయ నిర్మాణానికి అడ్డుపడుతున్న శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి అడ్డుపడుతున్న బిఎంఎస్ నాయకుడు అప్పాని శ్రీనివాస్ వైఖరిని నిరసిస్తూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కాలనీ కి సమాంతరంగా టెంపుల్ అభివృద్ధి జరిగింది అని భక్తుల తాకిడి పెరగడం తో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకుని పోవడం తో టెంపుల్ పునర్నిర్మాణం కోసం 50 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది అనంతరం ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో బిఎంఎస్ నాయకుడు అప్పాని శ్రీనివాస్ ప్రతిసారి అడ్డు తగిలి సింగరేణి స్థలం గుడికి ఎలా కేటాయిస్తారని సింగరేణి జిఎంకు లెటర్ ల ద్వారా నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్నారు తన ఆఫీసు కోసం అంబేద్కర్ సెంటర్లో ఎకరం భూమిని తీసుకోవచ్చు కానీ హనుమాన్ భక్తుల కోసం గుడి కట్టుకుందాం అంటే కట్టుకోనీయకుండా అడ్డుపడటం శోచనీయమన్నారు సింగరేణి స్థలంలో అక్రమంగా తన కోటర్ వెనుక గోడను అనుకొని గేటు నిర్మించుకొని రహదారి ఏర్పాటు చేసుకొని గుడి కడితే తన రహదారికి ఎక్కడ అడ్డు వస్తుందో అని నెపంతో నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్నారు బిజెపి నాయకునిగా ఉండి గుడులను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు ఈరోజు నుండి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని కాలనీవాసులు అన్నారు.. ఇకనైనా తన వైఖరి మార్చుకోకపోతే తన ఇంటి ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు క్యాతరాజు సతీష్, కరాటే శ్రీనివాస్ అశోక్ రాకేష్ ,ముఖేష్ అభిలాష్ రాజు, పరమేశ్వరి బోడ పద్మ, శారద, తో పాటు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు

విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు రోడ్డుపై వంటావార్పు…

విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు రోడ్డుపై వంటావార్పు

భూపాలపల్లి నేటిధాత్రి

ఆర్టిజన్ ఆన్ మ్యాస్ కార్మికుల ధర్నా ఉదృతం సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకువెళతాం డిమాండ్ చేసిన కార్మికులు
విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద వంట వార్పు నిర్వహించిన ఆర్టిజన్, ఆన్హ్మాన్ కార్మికుల ధర్నా కార్యక్రమం ఉదృతంగా కొనసాగింది. టీవీఏ జేఏసీ చైర్మన్ నాగుల తిరుపతి రెడ్డి కన్వీనర్లు మొత్కూరి. కోటి, తిప్పరపు రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు డివిజన్ల నుండి సుమారు మంది కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ కన్వీనర్ యల్లా సురేందర్ రెడ్డి హాజరైనారు. విద్యుత్ సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని తెలిపారు ఆర్టిజన్ కార్మికులకు ఒక సర్వీస్ రూల్స్ ఓఎన్ఎమ్ కార్మికులకు ఒక సర్వీస్ రూల్స్ అమలు పరుస్తున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా మన తెలంగాణ విద్యుత్ సంస్థలో ఈ విధానం నడుపుతున్నారు. తక్షణమే విద్యా అర్హతను బట్టి ఆర్టిజన్ కార్మికులు అందర్ని ఏపీఎస్ఈబి రూల్స్ తో కన్వర్జన్స్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే తెలంగాణాలో రెండు డిస్కౌంలు ఉన్నాయి. ఒకటి. ఎస్పీడీసీఎల్ రెండవది ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ లో అన్మాన కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించారు. ఎన్పీడీసీఎల్ లో గుర్తించలేదు ఇది ఎక్కడి న్యాయం ఎస్పీడీసీఎల్ లో అన్మాండ్ కార్మికులను ఆర్థికంగా గుర్తించినట్లు ఎన్పీడీసీఎల్ లో గుర్తించాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు మా న్యాయమైన కోరికలు నెరవేర్చకపోతే ఇప్పటికీ సమ్మ నోటీసు ఇచ్చినాము ఎన్పీడీసీఎల్ ధర్నా అనంతరము ఏ క్షణం ఐనా సమ్మెకు పోతామని తెలిపారు అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణా విద్యుతు జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులకు కన్వక్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆర్థిక భారం పడినటువంటి సమస్యలు రాష్ట్రంలో ఏమి ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు విద్యార్హతల ఆధారంగా ఏపిఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ తక్షణమే స్వరన్ చేపట్టాలని డిమాండ్ చేశారు గతంలో వచ్చిన ఎన్ ఎంఆర్ విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ వ్యవస్థ తీసుకు వచ్చివిద్యుత్ సంస్థలో ఎట్లా విలీనం చేసుకున్నారో తెలిపారు జిల్లా కన్వీనర్ మొత్కూరి కోటీ, తిప్పరపు రాజు మాట్లాడుతూ, ఎన్సీడీసీఎల్ పరిధిలో సుమారు 1600 మంది ఆన్ల్మ్యైన్ కార్మికులు అన్యాయ పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీడీసీఎల్లో అమలు చేస్తున్న విధానాన్ని అనుసరించి, ఎన్పీడీసీఎల్లో కూడా ఆన్మ్యన్ కార్మికులను ఆర్టిజన్ గుర్తించాలని తెలిపారు అలాగే మీటర్ రీడర్స్ పీస్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే, 4తారీఖున జెన్ కో గేట్ పాల్వంచ్ లో ధర్నా కార్యక్రమం చేసి మానిరసన తెలుపుతామన్నారు. అనంతరం ఏడో తేదీన ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టి, ఎనిమిదో తేది నుండి నిరవధిక సమ్మెలోకి దిగుతామని కఠిన హెచ్చరిక జారీ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఏ క్షణమైన సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు.
విద్యుత్ ఆర్టిజన్ ఆన్ మ్యాన్ కార్మికుల ధర్నాకు సంఘీభావంగా ఐఎన్ టియుసి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కట్ల సదయ్య ప్రధాన కార్యదర్శి నిమ్మల మల్లేష్ తెలిపారు అనంతరం వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ ధర్నాలో ఆర్టిజన్ అన్మాండ్ కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version