అప్పాని శ్రీనివాస్ వైఖరి నిరసిస్తూ ధర్నా చేపట్టిన కాలనీ వాసులు

అప్పాని శ్రీనివాస్ వైఖరి నిరసిస్తూ ధర్నా చేపట్టిన కాలనీ వాసులు

హనుమాన్ ఆలయ నిర్మాణానికి అడ్డుపడుతున్న శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి అడ్డుపడుతున్న బిఎంఎస్ నాయకుడు అప్పాని శ్రీనివాస్ వైఖరిని నిరసిస్తూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కాలనీ కి సమాంతరంగా టెంపుల్ అభివృద్ధి జరిగింది అని భక్తుల తాకిడి పెరగడం తో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకుని పోవడం తో టెంపుల్ పునర్నిర్మాణం కోసం 50 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది అనంతరం ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో బిఎంఎస్ నాయకుడు అప్పాని శ్రీనివాస్ ప్రతిసారి అడ్డు తగిలి సింగరేణి స్థలం గుడికి ఎలా కేటాయిస్తారని సింగరేణి జిఎంకు లెటర్ ల ద్వారా నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్నారు తన ఆఫీసు కోసం అంబేద్కర్ సెంటర్లో ఎకరం భూమిని తీసుకోవచ్చు కానీ హనుమాన్ భక్తుల కోసం గుడి కట్టుకుందాం అంటే కట్టుకోనీయకుండా అడ్డుపడటం శోచనీయమన్నారు సింగరేణి స్థలంలో అక్రమంగా తన కోటర్ వెనుక గోడను అనుకొని గేటు నిర్మించుకొని రహదారి ఏర్పాటు చేసుకొని గుడి కడితే తన రహదారికి ఎక్కడ అడ్డు వస్తుందో అని నెపంతో నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్నారు బిజెపి నాయకునిగా ఉండి గుడులను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు ఈరోజు నుండి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని కాలనీవాసులు అన్నారు.. ఇకనైనా తన వైఖరి మార్చుకోకపోతే తన ఇంటి ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు క్యాతరాజు సతీష్, కరాటే శ్రీనివాస్ అశోక్ రాకేష్ ,ముఖేష్ అభిలాష్ రాజు, పరమేశ్వరి బోడ పద్మ, శారద, తో పాటు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version