ఘనంగా బొమ్మల కట్టయ్య 82వ జయంతి వేడుకలు..

ఘనంగా బొమ్మల కట్టయ్య 82వ జయంతి వేడుకలు

కరీమాబాద్, నేటిధాత్రి..

ప్రముఖ సామాజిక కార్యకర్త, నిరుపేదల పెన్నిధి, దళిత రత్న, ప్రజారత్న బొమ్మల కట్టయ్య 82వ జయంతి వేడుకలు ఈరోజు కరీమాబాద్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని బి కె ఫౌండేషన్ మరియు కరీమాబాద్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బొమ్మల అంబేద్కర్ అధ్యక్షతన జయంతి కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ముందుగా కట్టయ్య విగ్రహానికి పూలమాలలు అర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో యువకులకు వైట్ షర్ట్లు, విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, కట్టయ్య తన జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా విద్య మరియు సామాజిక చైతన్యం కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. 1968లోనే పాఠశాలలను స్థాపించి విద్యాసేవలు అందించడమే కాకుండా, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.

కట్టయ్య స్ఫూర్తితో సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ కార్పొరేటర్లు నాగపురి కల్పనా సంజయ్, మేడిది రజిత మధుసూదన్, కత్తరశాల వేణుగోపాల్, ఎస్సీ స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ కొంగర జగన్మోహన్, డి బి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మిద్దపాక ఎల్లయ్య, అంబేద్కర్ భవన్ కమిటీ అధ్యక్షురాలు తరాల రాజమణి, నీలం మల్లేశం, కడారి కుమార్, భారతీయ బౌద్ధ మహాసభ నాయకులు కిషన్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

అలాగే బజ్జీరి వాసు, బైరి నాగరాజు, గడ్డం యుగేందర్, బండి రాజమణి, జక్కుల రాజు, తరాల రవితేజ, ఎలుక నిశాంత్, నీలం రాజు, నీలం స్వామి, ఎలుక సిద్ధార్థ, ఓ నరేష్, ఒంటెల సురేష్ మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version