అల్ఫోర్స్ హై స్కూల్ (సీబీఎస్ఈ) లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
వర్దన్నపేట (నేటిధాత్రి)
*విద్యార్థులకు పరిపాలన పట్ల అవగాహన కల్పించాలని మరియు పరిపాలన యొక్క ప్రభావాలను తెలియపరిచినట్లయితే వారు కూడా పలు కార్యకలాపాలను చక్కగా అమలు పరచగలుగుతారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక ఆల్ఫోర్స్ హై స్కూల్ (సీబీఎస్ఈ ) లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాయకత్వపు లక్షణాలను తెలియపరచాలని మరియు నాయకత్వపు లక్షణాల యొక్క విశిష్టతను తెలియపరచినట్లయితే వాటిని పెంపొందించుకుంటారని మరియు పలు కార్యక్రమాలలో పై చేయి సాధించడమే కాకుండా విజేతలుగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తరగతి గదిలోని విషయాలను నేర్చుకోవడమే కాకుండా సమాజం పట్ల విస్తృతంగా అవగాహనను పెంపొందించుకొని ముందంజలో నిలవాలని సూచించారు విద్యార్థులకు గొప్ప పండుగని ఈ పండుగ సాంప్రదాయంగా కొనసాగిస్తున్నటువంటి వస్తున్నటువంటి స్వయం పరిపాలన దినోత్సవాన్ని నేడు వేడుకగా చాలా ఉత్సాహంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయమని మరియు విద్యార్థులు చక్కటి విషయాలను వారి మిత్రులతో పంచుకోవడం ఆనందాన్ని కలిగించిందని వారు చెప్పారు వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చక్కటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
