పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు వినయ, విధేయతలు కలిగి ఉండాలి…
కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
విద్యార్థులు తమ పాఠశాల స్థాయి నుండే వినయ విధేయతలు కలిగి ఉండాలని, విజ్ఞత తో కూడిన విద్యను అవలంబిస్తూ పాఠశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని బిఎల్ అల్ఫో న్సా పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.ముఖ్య అతిథులుగా జోషప్ తచాపరంభాత్, బినోయ్ మ్యాథ్యూ , ఎంఈఓ రమేష్ రాథోడ్, సిస్టర్ నోబుల్ లు హాజరవ్వగా పాఠశాల హెడ్ మిస్ట్రెస్ బ్లేస్సి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు.
ఆల్ఫోన్స లాంటి పాఠశాల రామకృష్ణాపూర్ పట్టణంలో ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరం అని అన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే జీవిత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశలో కష్టపడాలని సూచించారు.ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించినపుడు తల్లిదండ్రులు విజ్ఞతతో మెలగాలని తెలిపారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు కనబర్చిన సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులను అబ్బురపరచాయి. పాఠశాలలో ప్రతీ రోజూ,ప్రతీ కార్యక్రమంలో నిర్వహించే అంశాలను వీడియో ఆల్బమ్ రూపంలో చక్కగా చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్య అతిథులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
