అసెంబ్లీ సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ సమక్షంలో మజ్లిస్‌లో బారి సంఖ్యలో చేరిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ లో మజ్లిస్ ఎమ్మెల్యే కార్వాన్ కౌసర్ మొహియుద్దీన్ సమక్షంలో భారీ సంఖ్యలో అధికారికంగా మజ్లిస్
పార్టీలో చేరడంతో మజ్లిస్ రాజకీయ కార్యకలాపాలు మరింత బలపడతాయని అన్నారు.ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కొత్త సభ్యులను స్వాగతించారు మజ్లిస్ ప్రజా సమస్యలు, మైనారిటీ హక్కులు మరియు సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ అధ్యక్షులు అత్తర్ అహమ్మద్, గోరి సహబ్, పాల్గొని కండువా కప్పిన
మజ్లిస్ స్థానిక అధ్యక్షుడు ముహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ముహమ్మద్ జావాద్ బేగ్, ముహమ్మద్ జలీల్ మామో, ముహమ్మద్ సయ్యద్ అకీల్ ఖురేషి, ఖలీల్ బాషా మరియు ముహమ్మద్ నజీబ్ మజ్లిస్‌లో స్వాగతించారు.
