కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజైనా సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి మేల్కొల్పు సేవ, సుప్రభాత సేవ, రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం మహా మంగళహారతి విశేష పూజల అనంతరం మంగళ వాయిద్యాల, పురంతుల దండకాలు మధ్య పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకెళ్లి వైదిక క్రతువులు, శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ సకల దేవతలను ఆహ్వానించి అగ్నిదేవునికి పూజలు నిర్వహించి అగ్నిగుండ ప్రవేశాన్ని ప్రారంభించారు.అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులు “ఓం నమః శివాయ.. హర హర మహాదేవ” అనుకుంటూ అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, స్వామి వారి రథోత్సవ కార్యక్రమానికి దేవాలయ ధర్మాదాయ శాఖ, పోలీసు వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.a
