సోమనాథ దేవాలయంపై దాడికి 1000 సంవత్సరాలు – సిరిసిల్లలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
– బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సోమనాథ దేవాలయం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, జాతీయ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహాదేవాలయంగా ప్రసిద్ధి చెందింది. విదేశీ దండయాత్రల కాలంలో ఎన్నోసార్లు విధ్వంసానికి గురైనప్పటికీ, భారతీయుల అచంచల విశ్వాసం, ధైర్యం, సంకల్పబలంతో మళ్లీ మళ్లీ పునర్నిర్మించబడిన ఈ ఆలయం దేశానికి గర్వకారణంగా నిలిచింది.
సోమనాథ దేవాలయంపై జరిగిన దాడికి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని, భారతీయ సంస్కృతి వైభవాన్ని, సనాతన ధర్మ గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం గం. 9:00లకు
సిరిసిల్ల పట్టణం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన గల శివాలయంలో
భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, ఓంకార మంత్ర జపం, హరతులు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడినాయి.
ఈ పవిత్ర కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల
జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా భారతీయ ధర్మ పరంపరపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం,
ఆధ్యాత్మిక ఐక్యతను బలోపేతం చేయడం,
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలనే భావనను ప్రజల్లో నాటడం
ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు నరసయ్య దేవరాజు, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధులు చొప్పదండి శ్రీనివాస్, మోర రవి, సూరం వినయ్, ఎర్రం విజయ్, సీనియర్ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
