మావోయిస్టు కరపత్రాలు
మావోయిస్టు కరపత్రాలు వాజేడు మండలకేంద్రంలో శనివారం రాత్రి మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. జల్, జంగల్, జమీన్‌పై ఆధికారం ప్రజలదేనని నినదిస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసులను అడవి నుంచి గెంటివేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేఖంగా ప్రజాస్వామిక వాదులు, ఆదివాసులు, అన్నివర్గాల ప్రజలు పోరాడాలన్నారు. న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను నిర్వాసితులను చేయాలనే కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సాయంత్రం మావోయిస్టులు మండలకేంద్రంలో కరపత్రాలు వదిలివెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.