dieo karyalayamlo…dongalu….,డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…?
డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…? వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్‌జిల్లా కార్యాలయంలో క్యాంపు డబ్బులకు కొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్నంవేసి మాయంచేసిన పరిస్థితి కార్యాలయంలో నెలకొన్నది. సుమారుగా 10లక్షలకు పైగా వీరంతా కలిసి మాయంచేసినట్లు సమాచారం. ‘నేటిధాత్రి’లో ”డిఐఈవో కార్యాలయంలో..అవినీతి లీలలు”, ”కాసులపై ప్రీతి…ఇదేం రీతి”, ”భుజాలు తడుముకుంటున్నారు”, ”ప్రైవేటు..రుబాబు”, ”అవినీతికి…సూత్రధారి..?”, ”కెమెరాలు బంద్..డిఐఈవో హస్తం ఉందా..?”, ”మాయమైన పైసలు..సాయిబాబా మహిమలు..”, ”అవినీతి లీలలపై ఉలుకులేదు..పలుకులేదు..” అనే శీర్షికలతో ప్రచురితమైన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో…