ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండలంలోని అన్నారం షరీఫ్‌లోని యుపిఎస్‌ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వర్‌ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని అన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, 2జతల దుస్తువులు, అన్ని రకాల సౌకర్యాలు గల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ విద్యాసంవత్సరం నుండి 1వ తరగతి నుండి ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేస్తున్నామన్నారు….