ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్‌

సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనియాడారు. హన్మకొండ భవానీనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా…