దేశంలో రెండోసారి మోడీ హవా : కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులు

దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి తన సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన బిజెపి ఎవరి మద్దతు లేకుండానే అధికారపీఠం ఎక్కడానికి మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. మిత్రపక్షాల సహకారం లేకుండానే 299 స్థానాలను సాధించుకుంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 348 స్థానాలతో బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. యుపిఎ తన మిత్రపక్షాలతో కలిసి 90స్థానాలను సాధించగా కేవలం…