రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీప్రగతి హైస్కూల్ లో తైక్వాండో బెల్ట్ ప్రధాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈకార్యక్రమంలో విద్యార్దులు చేసిన కృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో ఎల్లో, గ్రీన్, గ్రీన్ ప్లస్, బ్లూ బెల్టులను సాధించడం జరిగింది. ఈకార్యక్రమంలో తైక్వాండో జిల్లా అధ్యక్షులు డి.సంతోష్, పాఠశాల కరాటే అధ్యాపకులు జి.సంతోష్, పాఠశాల కరస్పాండెంట్ అన్నదానం రాధాకృష్ణ, ప్రధానోపాధ్యాయులు అలె వెంకట్ నారాయణ, డైరెక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.