Mission Mughdampuram Foundation Distributes T-Shirts to Youth
మీషన్ మగ్దంపురం ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ షర్ట్ పంపిణీ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని ముగ్దంపురం గ్రామంలోని చందు బంజారా యూత్ అసోసియేషన్ సభ్యులకు మీషన్ ముగ్దంపురం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ కార్తీక్ గౌడ్ జెర్సీ(టీ షర్ట్) లను ప్రోత్సాహకంగా అందించారు. మండ కార్తీక్ గౌడ్ మట్లాడుతూ గ్రామంలోని యువత క్రీడ స్ఫూర్తిని పెంపొందించాలని ఉద్దేశంతో జెర్సీలను అందించడం జరిగిందన్నారు.అదే విధంగా వచ్చే సంక్రాంతి పండుగకు నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న యువకులకు షటిల్ టోర్నమెంట్ ను ,మహిళలకు ముగ్గుల పోటీలను చందు బంజారా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సురేష్,సంతోష్,అంజన్ ,లక్కీ, విజయ్, తిరుపతి,శ్రీహరి, శ్రీను, దుర్గా, మురళి తదితరులు పాల్గొన్నారు.
