రైస్ మిల్లు అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం.
కల్వకుర్తి /నేటి దాత్రి :
రైస్ మిల్లు అసోసియేషన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన బీచని బాలకృష్ణ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం సోమవారం చేయడం జరిగినది. కార్యదర్శిగా పోల విజయకుమార్ కోశాధికారిగా యనుమగండ్ల రవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైస్మిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాబాలకృష్ణమాట్లాడుతూ డివిజన్ రైస్ మిల్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.