
నేటిధాత్రి, హన్మకొండ
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, హనుమకొండ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రదానం చేశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యూ విభాగంలో, సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని చింత స్వాతి, రెవెన్యూ డివిజన్లో ఉత్తమ ఉద్యోగినిగా ఎంపికైన సందర్భంగా, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ , మున్సిపల్ కమిషనర్, హనుమకొండ ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగి అవార్డ్ కు ఎంపిక చేసినందుకు రెవెన్యూ అధికారులకు స్వాతి కృతజ్ఞతలు తెలియచేశారు.