అవకాశం ఇస్తే..
అభివృద్ధి చూపిస్తా..
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా..
షేరి స్వప్న రమేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తననీ సర్పంచుగా ఒక్క అవకాశాన్ని ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని శేరి స్వప్న రమేష్ అన్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నందిగామ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గ్రామస్తుల సహకారంగా ఓటు అందియాలన్నారు. ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం నుండి ప్రజలకు రావాల్సిన ప్రతి పథకాన్ని అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓటర్ మహా శ్రేయులు మీ అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
