తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం.సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ముఖ్య అతిథిగా రాచ విద్యాసాగర్ గురు స్వాములు దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు రెండవ రోజు వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మరియు అన్నదానం పూజ కార్యక్రమం కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష్మీ నరసింహస్వామినీ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించారు ఇట్టి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు ప్రజలు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు