స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి :

వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం (ఎ.ఐ.పీ.కే.ఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి డిమాండ్ చేశారు.
దేశంలోని రైతాంగం పట్ల, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదా అని వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్నలు ప్రభుత్వాలను ప్రశ్నించారు.శుక్రవారం నర్సంపేట డివిజన్ కేంద్రంలో ఏ.ఐ. పీ.కే.ఎస్. వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం మైదంపాణి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా కెచ్చల రంగారెడ్డి, చంద్రన్నలు మాట్లాడుతూ రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక క్వింటల్ వరి ధాన్యానికి తరుగు పేరిట 5 నుండి 7 కిలోల చొప్పున తీస్తూ రైతులను నిలువున దోచుకుంటున్న అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పోడుభూమి పట్టాలు లేని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అనేక ఆంక్షలు విధిస్తూ పోడు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి ప్రకటించిన 500 రూపాయల బోనస్ ను దొడ్డు ధాన్యానికి కూడా వర్తింప చేయాలని అన్నారు. వరి, పత్తి ,మొక్కజొన్న, మిర్చి, ఇతర అన్ని రకాల పంటలకు పంట బీమా పథకాన్ని, అలాగే రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 15,000 వేల రూపాయలు ఇస్తానని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలని, లేకపోతే రైతు కూలీలంతా సంఘటితమై ఢిల్లీ తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
చిర్ర సూరి, జిల్లా నాయకులు ధార లింగన్న,కత్తుల కొమురయ్య, గటికొప్పుల రవి, కుమార్,యాకన్న, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!