స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న
నర్సంపేట,నేటిధాత్రి:
భారత వ్యవసాయ రంగలో ఎం.ఎస్. స్వామినాథన్ సూచించిన సిఫారసులను అమలు చేసి, రైతాంగ, మరియు వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కృషి చేయటంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఎఐయుకెఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న డిమాండ్ చేశారు.
శనివారం నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నర్సంపేట డివిజన్ ప్రధమ మహాసభ కత్తుల కొమురయ్య అధ్యక్షతన జరిగింది.
మహాసభలను జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి ప్రారంభించగా,
టియుసిఐ జిల్లా కార్యదర్శి అడ్డూరి రాజు, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహ రావు,జిల్లా అధ్యక్షులు ఆలువాల నరేష్ లు మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్, పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, దేశ వ్యవసాయంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.
దేశంలోని రైతులు 100 రకాల పంటలు పండిస్తుంటే కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి కేవలం 14 రకాల పంటలకే అరకొర
దేశంలో అత్యధిక మంది రైతులు పండించే వరి ధాన్యానికి గత రేటు కంటే కేవలం 69 రూపాయలే పెంచి మద్దతు ధరలు పెంచామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి, మొలకలొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారు చేస్తున్న కంపెనీలను , అవి అమ్ముతున్న షాపులను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత రబీ సీజన్ ప్రారంభంలో రైతాంగానికి ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని, సకాలంలో బ్యాంకులు రైతులకు వడ్డీ లేని రుణాలను అందించాలని కోరారు.
రైతు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని, భారత వ్యవసాయ రంగంలో ఎమ్.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహాసభ ప్రారంభానికి ముందు ఎ.ఐ.యు.కె.ఎస్. జెండాను చంద్రన్న ఆవిష్కరించారు.
డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక.
డివిజన్ స్థాయి నూతన కమిటీని ఎన్నుకోగా 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.డివిజన్
అధ్యక్షులుగా కత్తుల కొమురయ్య, ఉపాధ్యక్షులు ధార లింగన్న , ప్రధానకార్యదర్శిగా గట్టి కొప్పు రవి,
సహాయ కార్యదర్శిగా మల్లేష్,
కోశాధికారిగా బాబురావు, సభ్యులుగా చొప్పరి పైడి, గణపాక సుదాకర్, సింగన బోయిన కట్టయ్య, కోళ్ల రాజులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో గోపాల్, ఆలోచన, సమ్మన్న,రాధ, కోమల, మంజుల, స్వప్న, రాధిక ,సంజీవ, తిరుపతి, నర్సయ్య, వెంకన్న, రాజు, మల్లయ్య, కొమురయ్య, ఓం ప్రకాష్, శివలింగం, జంపయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.