స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం
భూపాలపల్లి నేటిధాత్రి
పైలెట్ కాలనీ లో గల సింగరేణి కమ్యూనిటి హాల్ లో
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏరియా సివిల్( ఏజినఎం ) రవికూమర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కమ్యూనిటి హాల్ ముందు వైపు, వెనుక వైపు ఉన్న పిచ్చి మొక్కలను చెత,చెదారాలను, అధికారులు సివిల్ సిబ్బంది తో కలిసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఏజినఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడిలో స్వచ్ఛ భారత్ ఆలోచన పదిలంగా ఉండాలని ఆయన కోరారు. పరిశుభ్రత ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా, సమాజ సంక్షేమానికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు . సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి వారి పని ప్రదేశాలలో, నివాస ప్రాంతాలలో శుభ్రత పాటిస్తూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. స్వచ్ఛతా నినాదాన్ని ప్రతిసారీ మన జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు. అందరి కృషితోనే పరిశుభ్రత సాధ్యమౌతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఎన్విరాన్మెంట్ అధికారి పోశమల్లు, సివిల్ (ఎస్. ఇ) బాలరాజు, అశోక్ రెడ్డి,ఇతర అధికారులు,ఉద్యోగులు ,సివిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.