
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల చెల్పూర్ గ్రామంలో పరిశుభ్రత ఒక మహోన్నత కార్యక్రమమని ప్రతి ఒక్కరూ బాధ్యత పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు
మంగళవారం స్వచ్చతా హి సేవా కార్యక్రమాల్లో భాగంగా చెల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుండి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల వరకు స్వచ్ఛతపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ
స్వచ్ఛతా పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు స్వచ్చత హి సేవా కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడం మరియు పరిశుభ్రమైన వాతావరణం సృష్టించడమేనని అన్నారు గ్రామీణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించగలరని కలెక్టర్ పేర్కొన్నారు ర్యాలీ సమయంలో ‘స్వచ్ఛత కోసం స్మార్ట్ కార్యాచరణ వంటి నినాదాలతో ప్రజలలో పరిశుభ్రత పట్ల చైతన్యం పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ భాద్యతగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలు ప్రజలు పరిశుభ్రతపై మరింత శ్రద్ధ పెట్టేలా మారుతుందని ఇట్టి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరి సహకారం అత్యంత అవసరమని ఆయన పిలుపునిచ్చారు ప్రతి కుటుంబం తప్పని సరిగా మరుగుదొడ్డి వినియోగించాలని తెలిపారు ఆరుబయట మల మూత్ర విసర్జన చేయడం సామూహిక నేరమని ఆయన పేర్కోన్నారు ఆరుబయట మల విసర్జన చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతయాలని తద్వారా అంటు వ్యాధులు ప్రబలుతాయని అన్నారు విద్యార్థులు పరిశుభ్రత పాటించే విధంగా తమ కుటుంబ సభ్యులకు తెలియచేయాలని సూచించారు పచ్చదనం పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి భాద్యతగా తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు
ఈ అవగాహన ర్యాలీలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు డిఆర్డిఓ అవినాష్ ఎంపీడీవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు