రమాదేవి సరంగపాణి ఆధ్వర్యంలో 16వ వార్డులో స్వచ్ఛ హీ సేవ

పరకాల నేటిధాత్రి(టౌన్)

పరకాల పట్టణం 16వ వార్డులో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ బండి రమాదేవి సారంగపాణి. ఈ కార్యక్రమంలో భాగంగా రాజుపేట, దళితవాడ స్కూల్ ఆవరణలో పరిశుభ్రత కోసం శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు చెత్త చుట్టుపక్కల పరిసర ప్రాంతం మొత్తం శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో 16వ వార్డు ఆఫీసర్ కంది శిరీష రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ గిరి, ఆర్ పి సునీత,బొచ్చు వాసు వార్డు అధ్యక్షులు, వార్డు సభ్యులు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!