
"BJP Leads Swachh Bharat Drive in Ganpuram"
బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలోని భూలక్ష్మి వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిచి దారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది
అలాగే నిన్న విపరీతంగా కురిసిన భారీ వర్షానికి గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతాల్లో చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుకోవడం జరిగింది ఇది కేవలం ఊర కాలువను శుభ్రం చేయకుండా చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పేరుకోవడం వల్ల వచ్చిన వరద నీరు కిందకు పోకపోవడం వలన ఇళ్లలోకి చొరబడడం జరిగింది అది తెలుసుకున్న బిజెపి పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడి సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెలుమల్ల ప్రవీణ్ కుమార్, బిజెపి మండల ఉపాధ్యక్షులు మధాసు మొగిలి, డాకురి కృష్ణ రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు,దుగ్గుషెట్టి.పూర్ణ చందర్ , మండల మహిళా నాయకురాలు బొల్లం అరుణ,బిజెపి మండల నాయకులు మంధల రాజు తదితరులు పాల్గొన్నారు.