జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ కి సస్పెండ్ చేయడం అనైతిక చర్య..

BRS MLA Jagadishwar Reddy,

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే .జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ కి సస్పెండ్ చేయడం అనైతిక చర్య.

సస్పెన్షన్ కు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు.గట్టు యాదవ్ పలస రమేష్ గౌడ్

వనపర్తి నెటిదాత్రి:

ప్రజాస్వామ్యంలో ప్రజల తరుపున అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,పట్టణ అధ్యక్షులు మాజీ. మార్కెట్ కమిటీ ఛైర్మన్ పలస రమేష్ గౌడ్ మీడియా బీఇంచార్జ్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వ పాలన పక్కదారి పడుతుందని సమయం ఇవ్వాలని కోరితే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీలో సస్పెండ్ చేయడంపై విమర్శించారు .రాష్ట్ర ప్రజల కిచ్చిన హామీలు వాగ్దానాలు రైతు భరోసా, రైతు భీమా,రైతు రుణ మాఫీ,మహిళకు 2500, నిరుద్యోగ భృతి ,కె.సి.ఆర్ కిట్టు,కళ్యాణ లక్ష్మి మహిళలకు తులం బంగారం రాష్ట్ర ప్రజల కు హామీలు ఇచ్చిన అంశాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డ్ ప్రజల వైపు ప్రశ్నిస్తే తట్టుకోలేక అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడారని ,దళిత స్పీకర్ ను అవమాన పరిచారని ఆరోపిస్తూ అసెంబ్లీ వాయిదా వేసి కుట్ర పూర్తిగా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ని సస్పెండ్ చేయాడాన్ని బీ ఆర్ ఎస్ నేతలు ఖండించారు. వెంటనే బేషరతుగా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పై సస్పెండ్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ, పెండం నాగన్న యాదవ్ ఉంగ్లమ్ తిరుమల్ నాయుడు ప్రేమ్ నాథ్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ నేతలు ఆ ర్ ఎం పీ డాక్టర్ దానియల్ ,స్టార్.రహీమ్ ,జానంపేట శ్రీనివాసులు, జోహేబ్ హుస్సేన్, ఫజల్, ఏ.కె.పాషా అలీం ఎం.వెంకటయ్య,మూణికుమార్.లక్ష్మణ్ శివ భరత్ ఇంతియాజ్ తోట .శ్రీనివాసులు.బీ ఆర్ ఎస్ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!