పరకాల నేటిధాత్రి
శుక్రవారం పురపాలక సంఘం పరకాల పట్టణంలో స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు అధ్యక్షుడు బొచ్చు కుమార్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అర్హులను గుర్తింపుగా ఇంటింటికి సర్వే చేసి లబ్ధిదారులను వారు ఉంటున్న ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సర్వేలో అర్హులను గుర్తించామని ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రడభుత్వం రూ.5 లక్షలను అందజేస్తుందని, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని, ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారని తెలిపారు.4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని,80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారని కుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జ్ అధికారి శిరీష రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులుషేక్ యాకుబ్,వీర్ల నరసయ్య,రజియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
1వ వార్డులో ఇండ్ల సర్వే
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 వాగ్దానాల అమలులో భాగంగా స్థానిక శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం ఉదయం పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో ఇల్లులేని నిరుపేదలను గుర్తించుటకుఇంటింటా సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్,ఇందిరమ్మ కమిటీ వార్డు ఛైర్మెన్ మడికొండ సంపత్ కుమార్,వార్డు ఆఫీసర్ శామీమా పాల్గొన్నారు.
2వ వార్డులో ఇండ్ల సర్వే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నేడు అమలు చేసిన ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనే రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో నిరుపేదలను గుర్తించి,ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే లక్ష్యంగా చేసుకొని, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ ఆదేశాల మేరకు రెండో వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రవి సార్‌తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి-చంద్రమౌళి(ఎస్సీ విభాగం అధ్యక్షులు) 2వ వార్డ్ సోషల్ మీడియా ఇంఛార్జి బొచ్చు జెమిని,కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్, ఒంటేరు వరుణ్,బొచ్చు రవి కుమార్,బొచ్చు అనిల్,బొచ్చు రాజు బొచ్చు నాగరాజు, జూపాక కిషన్ పాల్గొన్నారు.
18వ వార్డులో ఇండ్ల సర్వే
శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే పట్టణంలో 18వ వార్డులో ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వార్డు ఇంచార్జి అధికారిని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపిక సర్వే చేశారు.వార్డు లో ఇళ్లులేని నిరు పేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు.ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే చేపట్టారు. ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబాలకు ఇళ్లను అందజేసే లక్ష్యంతో సర్వే చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్ (శివమణి) ఒంటెరు భాగ్య,కుమార్,వార్డు సభ్యులు,ఏకు రవికుమార్, మహిళాలు,తదితరులు పాల్గొన్నారు.