– సర్వే అధికారులకు ప్రజలు సహకరించాలి….
– సర్వే ను పరిశీలించిన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్….
కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-
మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని చందాయిపేట గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే శరవేగంగా కొనసాగుతుందని తాజా మాజీ గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ తెలిపారు. శుక్రవారం చందాయిపేటలో ఇందిరమ్మ గ్రామ కార్యదర్శి రాధా తో కలిసి ఇండ్ల సర్వే సర్వేయర్లు యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని యాప్ లో ఏమైనా సమస్యలు ఏర్పడినట్లైతే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలను నివృత్తి చేసుకొని ఇందిరమ్మ కమిటీలకు సమాచారం అందించి సర్వే నిర్వహించాలన్నారు. గ్రామం లో సొంతింటి కల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయన్నారు. సర్వే నిర్వహణకు వచ్చిన సర్వేయర్లకు ప్రజలు సంబంధిత పత్రాలు అందించి సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో అసలైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, కార్యదర్శి రాధా,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొజామిల్, గ్రామ సినియర్ నాయకులు బైండ్ల శివరాజయ్యా, బాసరాజు, దండు మహేష్, సాయిబాబా, ఎరుకల రాజు, ఎరుకల బిక్షపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు..