మరిపెడ నేటి ధాత్రి :
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం గ్రామపంచాయతీలో సోమవారం ప్రభుత్వ సిబ్బంది నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ప్రజా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని పగడ్బందీగా అధికారులతో సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్నారన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను అందజేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నారని,అర్హులందరూ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధి పొందేందుకు సర్వే సిబ్బందికి సహకరించి తమ తమ వివరాలను మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయించుకోవాలని ప్రభుత్వ సిబ్బంది టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అల్వాల విజయ, గ్రామ పంచాయితీ కారోబార్ హాఫీజ్, గ్రామపంచాయతీ సిబ్బంది కర్రె వెంకటయ్య బంధు వీరన్న తదితరులు పాల్గొన్నారు.