పరకాల నేటిధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం రోజు 1వార్డు బొడ్రాయి,రజక,ముస్లిం,వారల వాదలలో సర్వే చేపట్టారు.ఈ సందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు ప్రజాపాలనలో సమర్పించిన 322 దరఖాస్తుల ఆధారంగా వార్డ్ ఆఫీసర్ ఎండి షమీం ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే చేపట్టడం జరుగుతుందని,ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుంబాలకు ఇళ్లను అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.వార్డులోని వారు ఇంటి పన్ను,నల్ల పన్ను,కరెంట్ బిల్లు,ఇంటి స్థలం పేపర్లు తగిన వివరాలు అందజేయాలని కోరారు.
ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇండ్ల సర్వే
