
Surprise Inspection at Sircilla Junior College
ప్రభుత్వం జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యాధికారి (co-ed) శ్రీనివాస్ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగినది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గదుల పరిశీలన మరియు సైన్స్ ల్యాబ్లు, విద్యార్థుల మేధాశక్తి గురించి, పాఠ్యాంశాల గురించి, మరియు విద్యార్థుల హాజరుశాతం పెంచాలని,అధ్యాపకులను ఉద్దేశిస్తూ మారుతున్న టెక్నాలజీ నేర్చుకొని విద్యార్థులకు విద్యాబోధన చేయాలని వారు కోరారు.ఎంసెట్ జేఈఈ ఎంట్రన్స్ లకు సంబంధించిన తరగతులను “ఫిజిక్స్ వాలా” నిర్వహిస్తున్నారని వాటి లో పాఠాలు విని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.. ఈ సంవత్సరం కళాశాలలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని అధ్యాపకులను, విద్యార్థులను కోరారు.
అలాగే పరిశీలన చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కష్టపడితేనే విజయం తప్పనిసరి తమ వెంట ఉంటుందని సూచనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ రఘునందన్, తెలుగు అధ్యాపకులు వివేకానంద, మరియు తదితర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.