Surprise Inspection of 108 and 102 Ambulances in Zahirabad
జహీరాబాద్‌లో 108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రోగ్రాం మేనేజర్ సంపత్, ఈఎంఈ కిరణ్ 108, 102 అత్యవసర సేవల అంబులెన్స్ వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల్లోని వైద్య పరికరాలు, మందుల నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర సమయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
