Surprise Check at Paddy Procurement Centers
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీసీ ఇన్చార్జ్లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని, రైతులు తెచ్చే వరికుప్పల తేమశాతాన్ని ప్రతిరోజూ ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. 17% తేమ శాతం వచ్చిన ప్రతి రైతుకు వెంటనే గన్నిబస్తాలు కేటాయించి, ఎలాంటి ఆలస్యం లేకుండా తూకం వేసి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని, ఏ విధమైన జాప్యం, నిర్లక్ష్యం సహించబోమని ఆయన హెచ్చరించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా నోటీస్ బోర్డు ఏర్పాటు చేసి, అందులో క్రింది వివరాలను రోజువారీగా స్పష్టంగా ప్రదర్శించాలన్నారు.
రోజు కేంద్రానికి వచ్చిన రైతుల సంఖ్య
సేకరించిన అంచనా ధాన్యం పరిమాణం
17% తేమ శాతం వచ్చిన రైతుల సంఖ్య
ఇప్పటివరకు కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం వివరాలు
రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు
అదేవిధంగా రోజువారీ తేమశాతం నమోదు రిజిస్టర్ క్రమ పద్ధతిగా నిర్వహించాలని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం సూచించిన ప్రొఫార్మాలకు అనుగుణంగా రైతుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి శ కిరణ్ కుమార్, డిఎం రాములు, చిట్యాల, మొగుళ్లపల్లి తహసీల్దార్లు ఇమామ్ బాషా, సునీత, సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
