
ఎహెన్ఆర్సీ ఉపాధ్యక్షుడిగా సురేష్ స్వామి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జాతీయ మానవ హక్కుల కమిటీ జహీరాబాద్ ఉపాధ్యక్షుడిగా పట్టణానికి చెందిన మఠం సురేష్ స్వామి నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయనకు జిల్లా కమిటీ ఛైర్మన్ వినయ్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు. అనంతరం సురేష్ స్వామి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. అక్రమాలను బహిర్గతం చేయడానికి నిస్వార్థంగా పని చేస్తానన్నారు.