
భూపాలపల్లి నేటిధాత్రి
బీసీ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా సూరం రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హల్ లో మున్నూరు కాపు సంగం జిల్లా అధ్యక్షులు పెండేల సంపత్ అధ్యక్షతన పలు బీసీ సంఘాల జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ జేఏసీ కమిటీ ని ఎన్నుకున్నారు. జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులుగా చేపూరి ఓదెలు యాదవ్, శేఖర్ నాని, ప్రధాన కార్యదర్శిగా రాదండి దేవేందర్, కోశాధికారిగా జంగిలి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా గుజ్జు స్వామి, వoఛనగిరి వీరేషంలను ఎన్నుకున్నారు. అనంతరం జేఏసీ జిల్లా అధ్యక్షులు సూరం రవీందర్ మాట్లాడుతూ దమాషా లెక్కల ప్రకారం 62%పైగా ఉన్న బీసీ లను అనగదొక్కేలా ప్రవర్తిస్తున్న రాజకీయ పార్టీలను భూస్థాపితo చేస్తామని హెచ్చరించారు. బీసీ లు అందరూ ఒకే వేదికగా ముందుకు సాగడానికే బీసీ జేఏసీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సంగం రాష్ట్ర అధ్యక్షులు సారంగపాని, పెరుక సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్రి రాజమౌళి, సామజిక వేత్తలు కాశెట్టి కుమార్, రాపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.