
Supreme Court’s Key Verdict on Street Dogs
వీధి కుక్కల కేసులో సుప్రీం సంచలన తీర్పు
వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 11 ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని స్పష్టం చేస్తూ.. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేదించింది.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. త్రిసభ్య ధర్మాసనం వీధి కుక్కలపై దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం పేర్కొంది. రేబిస్/ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టరాదని ఉత్తర్వులు జారీ చేసింది
ఢిల్లీ నుంచి తరలించిన వీధి కుక్కలను మళ్లీ వాటి స్థానాల్లోనే వదిలి పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ.. గతంలో జస్టిస్ పార్ధీవాలా ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం నిలిపివేసింది. కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని ఆదేశించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధమని చెప్పుకొచ్చింది.
కుక్కల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లో ఆహారం పెట్టాలని సూచించింది. వాటి కోసం డాగ్ లవర్స్, ఎన్జీఓలు రూ.25,000–2 లక్షలు జమ చేయాలని తెలిపింది. వీధి కుక్కల విషయంలో అధికారుల పనికి ఎవరూ అడ్డుపడొద్దని పేర్కొంది. ఈ అంశంపై 8 వారాల తర్వాత మళ్లీ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.