
నటుడు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం
రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడిగా ఉన్న హీరో దర్శన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము ఏకీభవించలేమని చెప్పింది. బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలపాలని నింధుతుడి తరపు లాయర్ ను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడుగా ఉన్న దర్శన్‌కు గతేడాది అక్టోబర్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా డిసెంబర్ 13న కర్నాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.