`నేటిధాత్రి ఎప్పుడో చెప్పింది ఆ వార్త.
`కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు.
`ఈడి వాదనలు పసలేనివి?
`సుప్రీం కోర్టు ఈడీ వాదనలు తోసిపుచ్చింది.
`ఎట్టకేలకు 5 నెలల తర్వాత బెయిల్ ఇచ్చింది.
`ఆత్మస్థైర్యం నిండిన మహిళా నేత కవిత.
`ఒక దశలో బెయిల్ పిటిషన్ కూడా వేయలేదు.
`అప్రూవర్‌గా మారితే ఊరట కల్పిస్తామని ఆశ చూపారు.
`జైలులోనే వుంటా…అప్రూవర్‌గా మారని తెగేసి చెప్పిన కవిత.
`బీఆర్‌ఎస్ లో అంబరాన్నంటిన సంబరాలు.
`రాజకీయ కక్ష్య సాధింపులతో కవితను ఇరికించారు.
`నిరాధార ఆరోపణలతో జైలుకు పంపించారు.
`మహిళ అని కూడా చూడకుండా కక్ష్య సాధింపులకు దిగారు.
`స్కీమే లేని పాలసీలో ఇరికించారు.
`స్కామ్‌గా చిత్రీకరించి జైలు పంపారు.
`కవితను అడ్డం పెట్టుకుని కేసిఆర్‌ను దెబ్బ కొట్టాలని చూశారు.
`బీఆర్‌ఎస్‌ను కోలుకోకుండా చేయాలనుకున్నారు.
-ఇప్పుడు కవిత రాజకీయ విశ్వరూపం చూస్తారు.
-తెలంగాణ రాజకీయాలలో కవిత నాయకత్వ పటిమను చూపిస్తారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ వీర వనిత కవిత. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన రaాన్సీలక్ష్మి భాయి పోషించిన పాత్రనే, తెలంగాణ విముక్తి కోసం, స్వయం పాలన కోసం, ఆత్మ గౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా యోధరాలే. అంతే కాదు, తెలంగాణ శాంతికపోత కూడా కవితే. ఎందుకంటే చరిత్రలో ఏ ఉద్యమమైనా రక్త సిక్తం కాకుండా పోరాటం జరలేదు. ఉద్యమాలు సాగలేదు. ప్రపంచ చరిత్రలో కేసిఆర్ నేతృత్వంలో సాగిన తెలంగాణ మలి దశ ఉద్యమం జరిగింత శాంతియుతంగా ఏ ఉద్యమం జరగలేదు. దేశ స్వాతంత్య్ర పోరాటం కూడా ముందు హింసాత్మకంగా సాగుతుంటే, గాందీ మహాత్ముడు అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. తెలంగాణ గాంధీ కేసిఆర్ కూడా ఆది నుంచి తెలంగాణ ఉద్యమం మొత్తం ఎక్కడా చిన్న పొరపాటు జరక్కుండా, రక్తపు చుక్క చిందకుండా సాగించాడు. దేశ రాజకీయాల్లోనే మహిళలకు పెద్దగా ప్రాదాన్యత లేదు. అలాంటి ఉద్యమాలలో మహిళ పాత్ర అన్నది చూసుకుంటే కల్వకుంట్ల కవిత లాంటి ఉద్యమ కారురాలు ఎవరూ కనిపించరు. సామాజిక ఉద్యమాలలో మహిళలు వుంటారు. కాని దేశంలో ఎన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగిన, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు సాగిన అందులో మహిళల పాత్ర పెద్దగా కనిపించదు. ఆ ఉద్యమాల ద్వారా వీర వనితలుగా గుర్తింపు పొందిన వారు లేరు. కాని ఒక్క కల్వకుంట్ల కవిత మాత్రమే ఉద్యమ స్పరూపిణిగా కనిపిస్తారు. పోరులో ముందుండి నడిచారు. అలాంటి కల్వకుంట్ల కవిత మీద మహిళా అని కూడా చూడకుండా రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ స్వాప్నికుడు, సాధకుడు కేసిఆర్‌ను రాజకీయంగా దెబ్బతీయాలని పథక రచన సాగించారు. ఆయనకు తెలంగాణ రాజకీయాల్లో వున్న పేరు ప్రఖ్యాతులు, దేశ వ్యాప్తంగా కేసిఆర్‌కు వున్న పలుకుబడిని చూసి జాతీయ పార్టీలు భయపడ్డాయి. దక్షిణాది నుంచి జాతీయ పార్టీ కేసిఆర్ ఏర్పాటు చేయడంతో జాతీయ పార్టీలకు వెన్నులో వనుకు పుట్టింది. ఎలాగైనా రాజకీయంగా కేసిఆర్‌ను ఆత్మరక్షణలో పడేలా చేయాలని చూశారు. కేసిఆర్‌కు కూతరు కవిత అంటే ఎంతో ప్రేమ. అంతే కాకుండా జాతీయ స్దాయిలో కవితను మించిన మహిళా నాయకురాలు ఇతర పార్టీలలో లేరు. తెలంగాణ ఉద్యమ యోధురాలిగానే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ఆమె లోక్‌సభలో ప్రజా సమస్యలపై అనర్గళంగా మాట్లాడుతుంటే సభ్యులంతా ఎంతో ఆసక్తిగా వింటూ వుండేవారు. తక్కువ సమయంలోనే ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పేరు సంపాదించుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం తరుపును వివిధ అంశాలపై అద్యయనం కోసం వివిద దేశాలలో కూడా పర్యటించారు. అంతటి శక్తివంతమైన కవిత తమ పార్టీలో వుంటే ఆ పార్టీల మనుగడకు మరింత ఉపయోగమని అనుకున్నారు. కాని కవిత వినిపించుకోలేదు. వారి ఆహ్వానానికి స్పందించలేదు. ఎలాగైనా కేసిఆర్‌ను ఇబ్బందులకు గురి చేస్తే తప్ప ఆయన జాతీయ పార్టీ ఆలోచనలు విరమించుకోరు. అందుకే కల్వకుంట్ల కవిత మీద లేనిపోని కేసులు నమోదు చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పాలసీ నిర్ణయాలలో ఆ రాష్ట్రాల శాసన సభ్యులు, ఆ పార్టీల క్రియాశీలక సభ్యులు పాత్రదారులుగా వుంటారు. నిజానికి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా వారు తీసుకునే పాలసీలను ఇతర పార్టీల వారికి తెలియకుండా ఎంతో జాగ్రత్తపడతారు. అందుకే కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. వాటిలో కూడా స్పష్టంగా ఏ విషయాలను వెల్లడిరచమని ప్రమాణం చేస్తారు. అలాంటి డిల్లీ ప్రభుత్వం తీసుకునే పాలసీకి కవితకు సంబంధం ఎలా వుంటుంది? ఈ చిన్న లాజిక్ తెలిసినా ఎలాగైనా కక్ష్య సాధింపులకు దిగారు. ఆమెను ముందుగా బిజేపిలోకి లాక్కునే ప్రయత్నం మొదలుపెట్టారు. కాని ఆ ప్రయత్నం సాగలేదు. దాంతో డిల్లీ లిక్కర్ పాలసీలో ఇరికించే ఎత్తుగడ వేశారు. అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా లిక్కర్ పాలసీ ఆలోచన తప్ప ఆచరణ చేపట్టలేదు. దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించిన తర్వాత కవితను అరెస్టు చేయడంలో అర్ధం లేదు. నిజంగా ఏదైనా విచారణ జరగాలన్నా, జరపాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద జరపాలి. అంతే కాని నక్కకు, నాగలోకానికి ముడిపెట్టినట్లు భావసారూప్యత కల్గిన రాజకీయ పార్టీలుగా వున్న బిఆర్‌ఎస్, ఆప్ పార్టీలను ఏక కాలంలో దెబ్బకొట్టాలన్న ఎత్తుగడ వేశారు. కాని ఆ కుట్ర ఫలించలేదనే చెప్పాలి. డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సుమారు 18 నెలల పాటు తీహార్‌జైలులో వుంచారు. ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్ధలను ఈ విధంగా రాజకీయంగా ఎలా వాడుకుంటుందన్నది ప్రపంచానికి తెలిసిపోయింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అటు మనిషీ సుసోడియా విషయంలోగాని, ఇటు కవిత, కేజ్రీవాల్ కేసుల్లో గాని ఎలాంటి ఆధారాలు లభించలేదు. ముఖ్యంగా కవిత మీద నమోదు చేసిన కేసులో సుమారు 50వేల పేజీల రిపోర్టు తయారు చేశారు. 493 మందిని సాక్ష్యులుగా చేర్చారు. ఇంకా విచారణ పేరుతో ఈడీ, సిబిఐలు కాలయాపన చేయడాన్ని సుప్రింకోర్టు కూడా తీవ్రంగా తప్పుపట్టింది. ఒక మహిళను అందులోనూ ప్రజా ప్రతినిదిని ఇంత కాలం జైలులో వుంచడం అన్నది సరైంది కాదు. సెక్షన్ 45(1) ప్రకారం మహిళా హక్కులను కాలరాయడమే అవుతుంది. అయితే మనీలాండరింగ్ కేసులో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు వుండవన్న ఆలోచనతోనే ఈడీని కేంద్రం రంగంలోకి దించింది. కాని ఆమె ఒక ప్రజా ప్రతినిధురాలు.
డిల్లీ ప్రభుత్వమే లిక్కర్ స్కీమే లేదు. స్కామ్‌కు ఆస్కారమెలా వుంటుందని తేల్చిన తర్వాత ఇక మనీ లాండరింగ్‌కు ఆస్కారమే లేదన్నది కవిత వాదన. ఇప్పుడు అదే నిజమైంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ త్యాగం, పోరాటం కలిసి వున్న కల్వకుంట్ల కవిత జైలు నుంచి కూడా న్యాయ పోరాటమే చేశారు. న్యాయంగా, ధర్మంగా, చట్ట పరంగా,రాజ్యాంగ పరంగా వచ్చే బెయిల్ కోసం ఎదురుచూశారు. ఒక దశలో ఇతర కారణాలు చూపుతూ బెయిల్ పిటీషన్ వేయడానికి కూడా ఆమె అంగీకరించలేదు. ఎంత కాలమైనా జైలులో వుండేందుకే ఆమె మొగ్గు చూపింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల మీద న్యాయం పోరాటంచేసింది. నిజం చెప్పాలంటే ఆమె కడిగిన ముత్యంలా బైటకు వచ్చింది. ఇది బెయిలే కావొచ్చు, కాని తుది తీర్పు ఇందుకు భిన్నంగా వుండే అవకాశమే లేదు. ఈడీ, సిబిఐలకు దొరికిన ఆదారాలు లేవు. అసలు అందుకు సృష్టించిన సాక్ష్యాలలో పస లేదు. ఇదంతా కేసిఆర్ ప్యామిలీని, బిఆర్‌ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసే రాజకీయ దుర్మార్గమైన ప్రక్రియే తప్ప, సిద్దాంత పరమైన రాజకీయం కాదు. రాజకీయాలు రాజకీయంగా చేయాలి. కాని ఇలా వేధింపు రాజకీయాలు ఎవరూ చేయొద్దు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. కాలమే శాశ్వతం కాదు. ఒక గడియ గడిచిందంటే కాలంలో దాని స్ధానం కోల్పోయినట్లే. అలాగే రాజకీయాలు కూడా అంతే. నాయకులు ఎవరూ శాశ్వతం కాదు. వారికి అధికారం ఎల్లకాలం వుండదు. కాని దేశం కోసం, తమ జన్మభూమికోసం ఏళ్ల తరబడి పోరాటం చేసిన కల్వకుంట్ల కవితను ఇబ్బంది పెట్టి పెద్ద తప్పే చేశారు. ముందు కొంత మంది కవిత మీద పెట్టిన కేసుల విషయంలో అపోహలు పడ్డా, తర్వాత పార్టీలకు అతీతంగా కక్ష్య సాదింపులే కనిపిస్తున్నాయన్న చర్చలు సాగాయి. అంటే ఒక మహిళా నేతను ఇంతగా ఇబ్బందిపెట్టడం అన్నది ఆ పార్టీలకు ఎప్పుడూ మంచిది కాదు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కవిత ఒక కీలకపాత్ర పోషించే అవకాశాలు మెండుగా వున్నాయి. తెలంగాణ ఉద్యమ కారురాలుగా, పోరాటం ఆమెకు కొత్త కాదు. తనకు జరిగిన అన్యాయం మీద క్షేత్ర స్ధాయిలోకి వెళ్లి, ప్రజా క్షేత్రం నుంచి తెలంగాణ లో జాతీయ పార్టీలను తరిమేయడం ఆమెకు పెద్ద లెక్క కాదు.