సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి

– జిల్లాలను తీసివేయడం సమంజసం కాదు
– రాష్ట్రంలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు


– కేసీఆర్ రాష్ట్రంలో ఏమి చేస్తే వ్యతిరేకంగా చేయాలని ఉద్దేశంతో రేవంత్
– బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
సిరిసిల్ల, మే – 4(నేటి ధాత్రి):
విస్తృతంగా పర్యటిస్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయమే సిరిసిల్ల పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురుతో మాట్లాడారు. రైతు బజార్ వద్ద హోటల్ లో టీ తాగి, ఈ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం నుంచి నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో ఉన్న మార్కెట్ తోపాటు, అక్కడ ఉన్న ప్రజలు కార్మికులతో ముచ్చటించారు. పలువురి ఇళ్లకు వెళ్లి ఓటుని అభ్యర్థించారు. పట్టణంలో మూడు నాలుగు వార్డుల్లో కార్నర్ మీటింగ్లను కూడా నిర్వహించారు. కేటీఆర్ ఉదయం పర్యటనతో సిరిసిల్ల పట్టణంలో సందడి నెలకొంది. అనంతరం
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ జిల్లాలు ఉంచుతారో ఏ జిల్లాలు తీసేస్తారో స్పష్టత ఇవ్వాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. శనివారం సిరిసిల్ల ప్రగతిభవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ప్రజల అభీష్టం మేరకు, పోరాటాల మేరకు కేసిఆర్ ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను తగ్గిస్తామంటూ మాట్లాడుతుందని ఏ జిల్లాలను ఉంచుతారు ఏ జిల్లాలను తీసేస్తారో స్పష్టత ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో 17 జిల్లాలను మాత్రమే ఉంచి మిగతా జిల్లాలను తీసేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ జిల్లాలను తీసేస్తారో స్పష్టం చేయాలని అన్నారు. సిరిసిల్ల నేతన్నల కోసం గత ప్రభుత్వం ఇచ్చిన క్రిస్మస్ చీరలు, బతుకమ్మ చీరలు కట్ చేసి నేతన్నల ఉసురు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దమ్ముంటే 600 కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత నాలుగు నెలల కింద సిరిసిల్ల మానేరు బ్రిడ్జి కింద గోదావరి నీళ్లు కనిపించేవని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే నీళ్లు మాయమైపోయాయని అన్నారు. కాలేశ్వరం మరమత్తులు చేసి రైతులకు నీళ్లు ఎప్పుడు ఇస్తారు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో బహుజన సమాజ్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీ కండువా కప్పి కేటీఆర్ వారిని ఆహ్వానించారు. సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షు లు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ జిందం కళ- చక్రపాణి, బొల్లి రామ్మోహన్, దార్ణం లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!