మంద శ్రీకాంత్
ఎస్ఎఫ్ఐ హన్మకొండ
జిల్లా ప్రధాన కార్యదర్శి
పరకాల నేటిధాత్రి
రాజు యాదవ్ కవరేజ్ సాంగును ప్రేక్షకులు అందరూ ఆదరించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు గురువారం రోజున కాకతీయ యూనివర్సిటీలోని క్యాంటీన్ దగ్గర రాజు యాదవ్ కవరేజ్ సాంగ్ వాల్ పోస్టర్స్ ను ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రేక్షకులు అందరూ కూడా రాజు యాదవ్ కవరేజ్ సాంగ్ ని ఆదరించాలన్నారు.ఈ పాటతో తొలి పరిచయం అవుతున్న హేమంత్ (చెర్రీ)ఆశీర్వదించి గుర్తించాలన్నారు.చిన్నచిన్న ఆర్టిస్టులను కూడా గుర్తించి వారిని పైకి తీసుకువచ్చే బాధ్యత కూడా ప్రేక్షకుల పైన ఉంది అన్నారు వారు తమ టాలెంట్ నమ్ముకుని వివిధ రంగాలలో నటిస్తూ వారి యొక్క సత్తా చాటుతున్నారు అన్నారు కావున ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క రాజు యాదవ్ కవరేజ్ సాంగ్ ను ఆదరించాలని మనస్ఫూర్తిగా ప్రేక్షకులు అందరినీ కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ యొక్క పాట చిత్రీకరణకు డైరెక్షన్ దీపక్ నాని, ప్రొడ్యూసర్ హేమంత్,కొరియోగ్రాఫర్ ప్రేమ్,డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రాజు మామిడి , డాన్సర్లు గా సాయితేజ, యశ్వంత్,ప్రోత్సాహకులుగా , స్టాలిన్,కుమార్,వినయ్, అరుణ్ ,కార్తీక్, చిత్రీకరించడానికి పని చేశారని వారు తెలిపారు.