
MLA Amarnath Reddy
*మంచి ప్రభుత్వాన్ని ఆదరించండి..
*ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం..
*వైసిపి నేతల విమర్శలను ప్రజలు నమ్మొద్దు..
*ఇంటింటికి టిడిపితో ప్రజా సమస్యల పరిష్కారం..
*సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి..
పలమనేరు(నేటి ధాత్రి) జూలై 04:
ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే సంక్షేమ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సత్య గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారుఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణి చేశారు. అదేవిధంగా ప్రజల వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ఇలా ఉండగా వార్డులో అడుగడుగునా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూఏడాది పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా అర్ధరహిత విమర్శలు చేస్తున్నదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు పరచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి మరోమారు సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించు కుందన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ప్రజాభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కూటమి మంచి ప్రభుత్వమని ఇప్పటి వరకు తాము చేసిన మంచి పనులను ప్రజానికానికి వివరించేందుకే సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్. వి.బాలాజీ,ఆర్ బి సికుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,బీఆర్శి కుమార్,కిరణ్, రూపేష్, సుదర్శన్ బాలాజీ, సురేష్ లతో పాటు జనసేన నాయకులు దిలీప్, హరీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.