కేటిఆర్ ను కలిసిన దళిత బంధు సాధన సమితి నాయకులు
పరకాల నేటిధాత్రి
దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటి సూచనల మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు,మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ను,మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ని దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్ మరియు పరకాల నియోజకవర్గ అధ్యక్షులు ఏకు కార్తీక్ రాష్ట్ర కమిటీ నాయకులు బొమ్మల శంకర్ లు కలవడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ గత పది నెలలుగా రెండవ విడత దళిత బంధు నిధుల సాధన కోసం నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదని రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ కి హరీష్ రావు కి మరియు దళిత నాయకులకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ లకు తెలిపారు.ప్రధాన ప్రతిపక్షంగా దళిత బిడ్డలకు మద్దతుగా ఉండాలని రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరడం జరిగిందని దళిత బంధు సాధన సమితి నాయకుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన త్వరలోనే ఏ కార్యక్రమాలు తీసుకున్న కచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా సంపూర్ణ మద్దతు తెలుపుతామని దళితుల బాగోక కోసం తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఏవైతే దళిత బంధు కోసం కేటాయించిన నిధులను వారి అకౌంట్లో జమ చేసే విధంగా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా బలమెత్తుతామని తెలిపారని అన్నారు.అనంతరం దళిత బంధు నిధుల సాధన కోసం మద్దతు తెలపాలని బిజెపి నాయకులు మెదక్ ఎంపీ రఘునందన్ రావుని అలాగే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ని మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజు సాగర్,గెల్లు శ్రీనివాస్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి లను కలవడం జరిగిందని వారుకూడా శానుకూలంగా స్పందించరని అన్నారు.ఈ కార్యక్రమంలో గీసుగొండ మండల దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోట ప్రమోద్, బండి రాజు,అన్వేష్,నమిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.