సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ కరువు

భద్రాచలం నేటి ధాత్రి

పేదల బియ్యం దళారుల పాలు.- అందరికీ ముడుపులు ముట్టాయంటున్న బియ్యం మాఫియా బియ్యం మాఫియా పై, సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.

భద్రాచలం కేంద్రంగా సరిహద్దు రాష్ట్రాలకి చౌక ధరల బియ్యం తరలి పోతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు… కొందరు చౌక దుకాణదారులు వినియోగదారులకు కిలో రూపాయలు 10 చెల్లిస్తూ వారిని వద్ద నుంచి నేరుగా PDS బియ్యం తీసుకొని దళారులకు 15, 16 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే కూర్చున్న చోట నుండి కింటాకు 500 రూపాయలతో పాటు ప్రభుత్వం ఇచ్చే కమిషన్ బస్తాల విక్రయానికి ఆధారంగా ఆదాయం చౌక దుకాణదారుడుకి సమకూరుతోంది.. మరి కొంతమంది రేషన్ డీలర్లు దుకాణదారులను మభ్యపెట్టి బియ్యం బాగోలేదని చెప్పి నగదు ఇచ్చి పంపించేస్తున్నారు. వీరు కూర్చున్న దగ్గరనే బస్తాకు 500 సంపాదిస్తూ నెలకు సుమారు ఒక్కొక్క షాపు నుండి 100 కింటాల నుంచి 120 క్వింటాల వరకు బయటకు విక్రయిస్తూ నెలకు 70, 80 వేలు సంపాదిస్తూ ఏడాదికి లక్షల గడిస్తున్నారు. వీరికి దళారులు అడ్వాన్స్ గా నెలకు ముందే 30 వేల నుండి 50 వేలు, లక్ష రూపాయల వరకు అడ్వాన్స్ చెల్లిస్తూ వాళ్ల ఆటోలో తరలిస్తున్నారు. ప్రభుత్వం పేదల కోసం ఏర్పాటు చేసిన బియ్యాన్ని రేషన్ దుకాణదారులు, దళారులు దర్జాగా అమ్ముకుంటూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అడిగితే ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇస్తున్నాం అనే సమాధానం చెబుతున్నారు. ప్రజలెవరు రేషన్ షాపులు ఇచ్చే బియ్యాన్ని తినట్లేదని అందుకే మేము అమ్ముతున్నాము, దళారులు కొంటున్నారనే విధమైన నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం కోసమెరుపు. ఒక్క భద్రాచలంలోనే 21 పైగా చౌక దుకాణలు ఉన్నాయి. నెలకు లక్షల్లో చేతులు మారుతున్నాయి. కూర్చున్న చోటనే వీరికి దర్జాగా వేళల్లో జీతం వచ్చినట్టు ధనం వస్తోంది. ఇందులో బినామీలు చాలామంది ఉన్నారు. దళారీలు ఆటోలు కొనుగోలు చేసి ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్న దళారులకు 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. వారు వారి అవకాశాన్ని బట్టి రీసైకిలింగ్ మిల్లర్లకు లేదా ఒరిస్సా ఛత్తీస్ ఘడ్ దళారులకు 25 నుంచి 30 రూపాయలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.. భద్రాచలం మన్యం కేంద్రంలో దీనిపై ఎవరూ నిఘా పెట్టడం లేదు సివిల్ సప్లై అధికారులు దృష్టి పెట్టకపోవడం, పట్టించుకోకపోవడం అవకాశం ఉన్నంత వరకు దోచుకుంటున్నారు. రెవిన్యూ సివిల్ సప్లై అధికారులు పేద ప్రజలకు ఇచ్చే విజయాన్ని కొంతమంది వ్యక్తులు అడ్డదారులు అమ్ముకోవడాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలిస్తే గాని ఇటువంటి అక్రమ దందాలకు అడ్డు కట్ట పడదు. దీనిపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *