వైద్య విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం ఆవిష్కారం
వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు
850 నుంచి 3699 కి పెరిగిన ప్రభుత్వ ఎంబిబిఎస్ సీట్లు
మంత్రి సత్యవతి రాథోడ్
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం హైదరాబాద్ నుండి నూతనంగా నిర్మించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాలలలో విద్యా బోధనా తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సీఎస్ శాంతి కుమారి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి , ఇతర ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వైద్య కళాశాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టంగా నేటి ప్రారంభోత్సవాన్ని మంత్రి అభివర్ణించారు. ఉద్యమ నాయకులు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరిష్ రావు నిరంతర పర్యవేక్షణ ఫలితంగా దీనిని సాధించామని, భూపాలపల్లి లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభోత్సవానికి కృషిచేసిన జిల్లా కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
57 సంవత్సరాల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయని, గత 9 సంవత్సరాలలో 21 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం సంతోషం
రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుతో ఇతర దేశాలకు వెళ్లి అభ్యసించవలసిన దుస్థితి తప్పిందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదివే అవసరం లేకుండా స్వ రాష్ట్రంలోనే వారి స్వప్నాలను సాకారం చేసుకునే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారు మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎంబిబిఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడే నాటికి 2850 ఎంబిబిఎస్ సీట్లు ప్రస్తుతం 8515 సీట్లకు పెరిగాయని మంత్రి తెలిపారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ 9 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించడం చాలా సంతోషకరమని, జిల్లాలోని మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి ప్రాంతంలో వైద్య కళాశాల మంజూరు చేసినప్పుడు అందుబాటులో ఉన్న తక్కువ సమయంలో విద్యార్థుల కోసం సకాలంలో అందించేలా కృషిచేసిన ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు.
భూపాలపల్లి మెడికల్ కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, మొదటి దఫాలో 95 సీట్లు విద్యార్థులకు కేటాయించామని, మిగిలినవి తోరలో భర్తీ కానున్నాయని విద్యార్థులకు వసతి సౌకర్యం కోసం సింగరేణి క్వాటర్స్ లో పూర్తీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణంలో కృషిచేసిన అధికారులకు ఇంజనీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అన్ని రకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని, మంచి అనుభవం కలిగిన అధ్యాపకులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నారని, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి డాక్టర్లుగా తయారు కావాలని, ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర విద్యార్థులకు సూచించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జక్కుల శ్రీహర్షిని, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ప్రజా ప్రతినిధులు, భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు దేవుడే, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీ రామ్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నవీన్, జిల్లా అధికారులు, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.