Neeta Ambani’s Heartwarming Birthday Surprise
సూపర్.. నీతా అంబానీ పెద్ద మనసు.. స్టాఫ్ మెంబర్ పుట్టిన రోజున సెలబ్రేషన్స్..
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గొప్ప మనసు గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. తన దగ్గర పనిచేసేవారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంటారు. కోట్లకు పడగలెత్తిన నీతా తన ఉద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో చాటి చెప్పే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
నీతా అంబానీ తన టీమ్ మెంబర్ పుట్టిన రోజును దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేశారు. తన దగ్గర పని చేసే మహిళా ఉద్యోగి పుట్టిన రోజున నీతా అంబానీ దగ్గరుండి కేట్ కట్ చేయించారు. కేక్ తినిపించి మరీ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీమ్‌లోని మిగిలిన వారు ‘హ్యాపీ బర్త్‌డే’ పాట పాడుతుండగా, నీతా అంబానీ తన స్టాఫ్ మెంబర్ పక్కన నిలబడి ఉన్నారు. ఈ వీడియోను బర్త్ డే జరుపుకున్న ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు (viral Ambani video).
