
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహం నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన విద్యార్ధిని సునీత అగ్ని వీర్ మహిళా పోలీస్ విభాగానికి ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అనితను సన్మానించి అభినందించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థినీ విద్యార్థులు ఇలాంటి ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు వి.పాండు, వసతి గృహ సంక్షేమ అధికారి స్వప్న ప్రియ పాల్గొన్నారు.